Telugu Bible Studies
స్టడీ గైడ్ ధ్యాన పాఠాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి దానిపై క్లిక్ చేయండి.
తర్వాత Adobe Acrobat Reader (అడోబీ ఆక్రోబ్యాట్ రీడర్) యాప్ ఉపయోగించి దాన్ని తెరవండి.
అంతకంటే ముందు Adobe Acrobat Reader (అడోబీ ఆక్రోబ్యాట్ రీడర్) యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని ఈ నిలకడలేని ప్రపంచంలో మీరు ఇప్పటికీ ఎప్పటికీ బైబిలునే ఎందుకు నమ్మవచ్చో కనుగొనండి.

అపవాది (సాతాను) ఎక్కడ నుండి వచ్చాడు? అతడు పరలోకంలో దేవదూతగా ఉండేవాడా? అతడు ఏ విధంగా పతనమై అపవాదిగామారాడు? దేవుడు లూసిఫరుని సృష్టించాడా? అయితే, ఎందుకు సృష్టించాడు?

మానవాళి కోసం దేవుడు రూపొందించిన దివ్య విమోచన ప్రణాళిక, రక్షణ యొక్క బహుమానం గురించి తెలుసుకోండి.

మీ వివాహం సంతోషంగాను మరియు అన్యోన్యంగాను ఉంటోందా? సంతోషకరమైన వివాహానికి 17 ప్రాముఖ్యమైన సూత్రాలను సూచించే ఈ బైబిల్ ధ్యాన పుస్తకం మిమ్మల్ని మీ జీవిత భాగస్వామిని మీ వైవాహిక జీవితంలో సుస్థిరమైన, శాశ్వత విజయానికి మిమ్మల్ని ప్రేరేపించి నడిపిస్తుంది.

దేవుని పది ఆజ్ఞలు రాతిపై ఎందుకు వ్రాయబడ్డాయి? ఆజ్ఞలు మార్చబడ్డాయా? మనం ఇంకా దేవుని ధర్మశాస్త్రము క్రింద ఉన్నామా? కృపదైవ ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేస్తుందా?

సబ్బాతు (విశ్రాంతిదినము) దేవుని పది ఆజ్ఞలలో నాల్గవ ఆజ్ఞగా దేవుని సృష్టికార్యానికి జ్ఞాపకార్థంగా స్థిరమైన పునాదిగా నిలుస్తుంది.

ఇమ్మర్షన్ (నీటిలో ముంచుట) ద్వారా బాప్తిస్మము అనేది దేవునితో కలిసి జీవితాన్ని జీవించడానికి అంగీకారంతో ఎంపిక చేసుకునే ప్రక్రియకు గుర్తు.

చనిపోయిన మీ బంధువుతో మాట్లాడటానికి ప్రణాళికలు వేసుకోకండి. బదులుగా చనిపోయినవారు ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని గూర్చి చెప్పబడిన అతి పచ్చి అబద్ధాన్ని బట్టబయలు చేసే ఈ బైబిల్ ధ్యాన పాఠాన్ని లోతుగా అధ్యయనం చేయండి?

నరకాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ఎవరు పాలిస్తున్నారు? ప్రస్తుతం నరకంలో మనుషులు ఉన్నారా? నరకం ఎలా ఉంటుంది, అది ఎంత పెద్దదిగా ఉంటుంది? నరకాగ్ని బాధ్యతను దేవుడు సాతానుకి అప్పగించాడా?

మిస్ అవ్వకండి : బైబిల్‌లోని అత్యంత మహానీయమైన 1,000 సంవత్సరాలు ఇంకా రావలసి యున్నవి. ఆ సమయంలో మీరు సజీవంగా ఉంటారా? ఈ స్పష్టమైన బైబిలు ధ్యానంలో మీ భవిష్యత్తును కనుగొనండి.

మీరు వ్యాధులతో అలసి, ఒత్తిళ్లతో సొలసి, నిరంతరం అనారోగ్యం పాలవుతున్నారా? మీ వైద్య ఖర్చులకు బైబిల్లో పరిష్కారం ఉంది! బైబిలుకు సంబంధించిన ఈ ఆరోగ్య రహస్యాలు మీ జీవితాన్ని కాపాడతాయి.

విశ్వాస మూలముగా కృప ద్వారానే మనం రక్షింపబడినట్లయితే, మనం దేవుని ధర్మశాస్త్రానికి ఎందుకు విధేయత చూపవలసిన వారమైయున్నాము?

ఈ కనువిప్పు కలిగించే బైబిలు ధ్యాన పుస్తకంలో క్రీస్తువిరోధిని గూర్చిన పూర్తి వాస్తవాలను తెలుసుకోండి. సాతాను యొక్క అత్యంత శక్తివంతమైన అంత్యకాల మోసాన్ని తిప్పికొట్టడానికి మీరు ఇప్పుడు ఏమి చేయాలో తెలుసుకోండి!

ప్రకటన 14లోని “మూడు దూతల అంత్యదిన వర్తమానాలు” నేటి మనకు గంభీరమైన హెచ్చరికలను జారీ చేస్తున్నాయి.

బైబిల్‌లోని ప్రత్యక్ష గుడారము పాతదై పోయిందా, నేటి కాలానికి వర్తించబడదా, లేక పనికిరానిదా? ఇది కేవలం యూదుల కోసమేఉద్దేశించినది కాదు. నేడే మీ శాశ్వతమైన రక్షణకు సంబంధించి అతి కొద్దిమందికే తెలిసిన అతి కీలకమైన అంశాన్ని వెలికితీయండి!

బైబిల్‌లోని అంతిమ తీర్పు గురించి మీరు భయపడుతున్నారా? లేక ఇది వట్టి బూటకమని భావిస్తున్నారా? మీరు నేర్చుకునే అత్యంత ముఖ్యమైన సత్యం తీర్పును గూర్చినది అని ఎందుకో తెలుసుకోండి.

హెచ్చరిక : మీరు దీని గురించి తెలుసుకోవడం సాతానుకి ఇష్టం లేదు! మృగము యొక్క ముద్ర ఏదో చిన్న మైక్రోచిప్పు లేదా పచ్చబొట్టు కాదు. అయితే దాని గురించి బైబిల్ లేఖనాలు బోధిస్తున్న విషయాలు మీ జీవితాన్ని కాపాడుతాయి.

ప్రకటన 17లో చిత్రీకరించబడిన బబులోను అని పిలువబడే “రక్తవర్ణపు వేశ్య”ను గూర్చి ఈ ధ్యాన పాఠం వెల్లడిస్తుంది.

క్రీస్తు యొక్క వధువు బైబిల్ అంతటా కనిపిస్తూ, ప్రకటన గ్రంథ అంత్యకాల ప్రవచనాలలో ముఖ్యమైన పాత్రను పోషించాల్సి ఉంది. ఈ మర్మమైన స్త్రీ ఎవరు?

మాంత్రికులు, జ్యోతిష్కులు చెప్పే జాతకాలు జోస్యాల విషయంలో దేవుడు వెనుకబడ్డాడా? దయచేసి తప్పుదారి పట్టకండి, మోసపోకండి.

మీరు దేవుణ్ణి నిజంగా ప్రేమించినప్పుడు మీ జీవితంలో ఎటువంటి మార్పు సంభవిస్తుంది? మిమ్మల్ని శాశ్వత ప్రేమతో ప్రేమించే దేవునితో ప్రేమలో పడటం గురించి ఈ స్ఫూర్తిదాయకమైన, జీవితాన్ని రూపాంతరపరిచే బైబిల్ ధ్యాన పాఠంలో కనుగొనండి!

మీరు చాలా దూరం వెళ్లిపోయి వెనుతిరిగి రాలేని స్థితిలో ఉన్నారని మీకు ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ మిమ్మల్ని విడిచిపెట్టిన సంకేతాలను మరియు శాశ్వతంగా నశించిపోకుండా మిమ్మల్ని రక్షించగల కీలకమైన సత్యాన్ని కనుగొనండి.